Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీలి చిత్రాల వీక్షణలో భారత్ టాప్.. మన తర్వాతే అమెరికా!

  • 89 శాతంతో భారతీయ వీక్షకులకు మొదటి స్థానం 
  • మూడు, నాలుగు స్థానాల్లో బ్రెజిల్, జపాన్ 
  • స్మార్ట్ ఫోన్లో చూసేది వీరంతా

అభివృద్ధి విషయంలో ఎలావున్నా ఈ ఒక్క విషయంలో మాత్రం మన భారతీయులు అగ్రరాజ్యం అమెరికాను సైతం వెనక్కి నెట్టేశారు. నీలి చిత్రాల వీక్షకుల్లో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని ఓ సర్వే తేల్చింది. ఈ విషయంలో అమెరికా రెండో స్థానంలో ఉండగా, బ్రెజిల్, జపాన్లు మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. ఇక నీలిచిత్రాలు వీక్షిస్తున్న వారి ప్రధాన సాధనం స్మార్ట్ ఫోన్ అని ఈ సర్వే తేల్చింది. 

వివరాల్లోకి వెళితే... ప్రముఖ నీలి చిత్రాల వెబ్ సైట్ పోర్న్ హబ్ ఇటీవల వెలువరించిన తన నివేదికలో భారత్ కు అగ్రస్థానం కట్టబెట్టింది. భారత్ వీక్షకుల్లో 89 శాతం మంది స్మార్ట్ ఫోన్లలో నీలి చిత్రాలు వీక్షిస్తున్నారని తేల్చింది. 81 శాతం అమెరికన్లు, 79 శాతంతో బ్రెజిలియన్లు, 74 శాతంతో జపనీయులు తర్వాత మూడు స్థానాల్లో ఉన్నారు.

ప్రపంచంలోని ప్రతి నలుగురు నీలి చిత్రాల వీక్షకుల్లో ముగ్గురు స్మార్ట్ ఫోన్లోనే చూస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లలో చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తేల్చింది. రహస్య వీక్షణకు స్మార్ట్ ఫోన్ కు మించిన సాధనం లేకపోవడమే ఈ పెరుగుదలకు కారణమని గుర్తించింది.

 భారత్ లో మొబైల్ డేటా వినియోగం నెలకు సగటున 9.8 జీబీ ఉందని, 2024 నాటికి ఇది 18 జీబీకి చేరుతుందని ఎరిక్సన్ అంచనా వేయడం చూస్తే ఈ వీక్షకుల ప్రభావం ఉందేమో.

Porn Hub
India
America
Japan

More Telugu News